వైయస్సార్సీపీ..ప్రజల పార్టీ
చీరాల)) వైయస్ఆర్ సీపీ ప్రజల పక్షాన పోరాడుతోందని చీరాల నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ నాయకులు తెలిపారు. వేటపాలెం మండలం, అనుమల్లిపేటలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలకు ప్రజలు విలవిల్లాడుతున్నారని, త్వరగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పుష్కరాలు, విదేశీ పర్యటనలంటూ చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రజలను పట్టించుకోవడమే మరచిపోయారని, సంక్షమ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదని వైయస్ఆర్ సీపీ నాయకులు తెలిపారు.
చంద్రబాబును ప్రజలు క్షమించరు.
కనిగిరి))చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైయస్సార్సీపీ నాయకులు అన్నారు. గడపగడపకు వైయస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా సీఎస్ పురం మండలం, ఆర్కె పల్లి ఎసీ కాలనీలో వారు పర్యటించి ప్రజాబ్యాలెట్ కరపత్రాలు పంచారు. చంద్రబాబు అడ్వర్టైజింగ్ డైరెక్టర్ గా పనికొస్తాడు కానీ ప్రజలను పాలించే నాయకుడిగా అస్సలు పనికిరాడని వారు తెలిపారు.
ప్రజానాయకుడు వైయస్ఆర్
నరసన్నపేట))ప్రజలకు నిజమైన పరిపాలనను అందించిన దేవుడు వైయస్ రాజశేఖరెడ్డి అని నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం చల్లవానిపేట వైయస్ఆర్ సీపీ నేత ధర్మాన క్రిష్ణదాస్ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా చల్లవానిపేటలో వైయస్ఆర్ సీపీ మండల కార్యాలయం ప్రారంభించారు. చంద్రబాబుకు ఓటేసి మోసపోయామని ప్రజలు తమగోడును నాయకుల దగ్గర వాపోయారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనర్హుడని పేర్కొన్నారు. విదేశీ పర్యటనలు చేస్తూ బాబు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జలుమూరు మండలం జడ్పీటీసీ,ఎంపీపీ, ఎంపీటీసీ, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.