నవరత్నాల పథ‌కాలతో ప్రతీ కుటుంబానికి ల‌బ్ధి

మాడుగుల :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల‌తో ప్ర‌తి కుటుంబానికి ల‌బ్ధి చేకూరుతుంద‌ని  పార్టీ మండల నాయకుడు లెక్కల ఈశ్వరరావు అన్నారు. మండలంలో డి.అగ్రహరం, దీక్షితులపాలెం గ్రామాల్లో మంగళవారం రాత్రి వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఈశ్వరరావు, పార్టీ కార్యకర్తలు 60 ఇండ్లకు వెళ్ళి నవరత్నాల పథ‌కాలను వివరించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలు చేయడం లేదని ఎండగట్టారు.  చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వేచలపు పైడంనాయుడు, దాసరి రామకృష్ణ, లెక్కల శ్రీరామ్మూర్తి, దాసరి నాయుడు, లెక్కల సూరినాయుడు, వేచలపు అప్పలరాము, సింహచలం, బల్లంకి చినబాబు, కోట్యాడ రమణ తదితరులు పాల్గొన్నారు.  

Back to Top