అడ్డాడలో గడప గడపకు వైయస్సార్

పామర్రు: మండల పరిధి అడ్డాడ గ్రామంలో గడప గడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమాన్ని శుక్రవారం సాయింత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కాకర్ల వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నియోజకవర్గ సమన్వయ కర్త కైలే అనీల్‌కుమార్‌ హాజరవుతారన్నారు. మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ హాజరయి కార్యక్రమాన్ని జయప్రదంచేయాలని పిలుపు నిచ్చారు.

Back to Top