వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే రాష్ట్రాభివృద్ధి

పశ్చిమగోదావరి: వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పాతపాటి స్రరాజు అన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఉనుదుర్రులో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్రరాజు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను వైయస్‌ఆర్‌ కుటుంబంలో భాగస్వాములను చేశారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మంతన యోగేంద్రబాబు ఉన్నారు. అనంతరం ఉండి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త నర్సింహరాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

Back to Top