బూటకపు హామీలతో నయవంచన

రైతును ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం
ఆలూరు(అస్ప‌రి): వ‌రుస‌గా మూడేళ్లు క‌రువొచ్చినా ప్ర‌భుత్వం రైతుల‌ను ఆదుకోలేక‌పోయింద‌ని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం విమ‌ర్శించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా మండ‌ల ప‌రిధిలోని పుప్పాల‌దొడ్డి, కైరుప్ప‌ల‌, క‌ల‌వ‌రి, యాట‌క‌ల్లు, తొగ‌లుగ‌ల్లు, ఐన‌క‌ల్లు, చొక్క‌న‌హ‌ళ్లి గ్రామాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. రైతుల‌కు పంట న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌డంలో టీడీపీ ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హారిస్తుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 

బాబుకు గుణ‌పాఠం చెప్పాలి
నంద్యాల‌(నూనెప‌ల్లి): అబ‌ద్ధాల‌తో పాల‌న సాగిస్తున్న సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లే గుణ‌పాఠం చెప్పాల‌ని వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మ‌లికిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ప‌ట్ట‌ణంలోని సలీంన‌గ‌ర్‌లో ప‌ర్య‌టించారు. అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు గ‌డుస్తున్న ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టి అమ‌లు చేయ‌లేక‌పోయార‌న్నారు. బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌ని ఓటు వేసిన నిరుద్యోగులు జాబ్ లేక రోడ్డున ప‌డ్డార‌న్నారు. రైతుల‌కు స‌కాలంలో స‌బ్సిడీపై ఎరువులు, ప‌నిముట్లు ఇవ్వక‌పోవ‌డంతో పంట‌సాగు భారంగా మారుతోంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేశారు
ముమ్మిడివ‌రం: ఎన్నిక‌ల స‌మ‌యంలో అమ‌లు కాని బూట‌క‌పు హామీలిచ్చిన టీడీపీ ప్ర‌భుత్వం వాటిని అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తోంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ పితాని బాల‌కృష్ణ ధ్వ‌జ‌మెత్తారు. కొత్త‌లంక పంచాయ‌తీ ప‌రిధిలో బంద‌రుపాలెం, ప‌చ్చ‌మ‌ట్ల‌వారిపాలెం, స‌త్య‌నారాయ‌ణ‌పురం ప్రాంతాల్లో ఆయన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసి చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌పై మార్కులు వేయించారు. 

ఆదుకునేవారే లేరు
జ‌గ్గంపేట‌: ప‌్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో తెలుగుదేశం ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ ముత్యాల శ్రీ‌నివాస్ విమ‌ర్శించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని పెంట‌ప‌ల్లి గ్రామంలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... రెండున్న‌రేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో రాష్ట్రం అధోగ‌తి పాల‌య్యింద‌న్నారు. తాను అధికారంలోకి రాగానే పూర్తిస్థాయిలో డ్వాక్రా, రైతురుణామాఫీ చేస్తాన‌న్న హామీ సంగ‌తి ఏమైంద‌ని ఆయ‌న బాబును ప్ర‌శ్నించారు. 

Back to Top