తూర్పుగోదావరి జిల్లాః ప్రజల సొమ్ముతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జల్సాలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ విమర్శించారు. పోలవరం మండలంలోని కేశనకురు గ్రామ పంచాయతీ పరిధిలో బాలకృష్ణ ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అబద్ధపు హామీలిచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు గాలికొదిలేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల మనోభావాలను కించపరుస్తూ ఆంధ్రరాష్ట్ర సంజీవని ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని దుయ్యబ్టట్టారు. కార్యక్రమంలో బాలకృష్ణ వెంట పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. <br/><strong>మండపేట నియోజకవర్గంలో</strong>తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. మండల పరిధిలోని ద్వారకపూడి గ్రామంలో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు పరిపాలనపై మార్కులు వేయించారు. అనంతరం ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అదే విధంగా జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. జగ్గంపేట మండలంలోని రామవరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు మోసపూరిత పరిపాలన విధానాలను వివరించారు.