ప్రజాబ్యాలెట్ లో ఓడిపోయిన చంద్రబాబు


బాబు చేసింది శూన్యం..
చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. రుణ మాఫీ జ‌ర‌గ‌లేదు, పిఛ‌న్ అంద‌డం లేదు, ఉన్న పొలాలు లాగేసుకుంటున్నారు. ఇవి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేస్తున్న నిర్వాకం అంటూ ప్ర‌జ‌లు మండిపడుతున్నారు.  గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో  భాగంగా పెట్ల   విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని  గొలుగొండ మండలం , కొంకసింగి పంచాయతీలో ఉమా శంకర్ గణేష్ ప్రతి గడపకి వెళ్లి ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను తెలియ‌జెప్పారు. ప్ర‌జాబ్యాలెట్ లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పూర్తిగా ఓడిపోతోంద‌ని ఆయ‌న తెలిపారు.

అబద్ధపు హామీల‌తో మోసం చేశారు...
అబద్ధపు హామీల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేసి గ‌ద్దెనెక్కిన బాబు ఇప్ప‌టివ‌ర‌కూ చేసిందేమీ లేద‌ని వైయ‌స్ఆర్ సీపీ  రాష్ట్ర కార్యదర్శ‌ జాన్ వేశ్లీ అన్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గం 23వార్డ్ ఎవియన్ కాలేజ్ ఏరియాలో కోల గురువులు ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన గడపగడపకూ వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి చంద్ర‌బాబు మోసాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశారు. కార్య‌క్ర‌మంలో సిటీ మహిళ ప్రెసిడెంట్ శ్రీ ఉషాకిరణ్, సిటీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ శ్రీ షరీఫ్ పాల్గొన్నారు.

ప్ర‌జ‌ల‌కు అండ‌గా వైయ‌స్సార్సీపీ...
              ముత్తుకూరు మండలం దువ్వురువారిపాలెం, డమ్మయపాలెం గ్రామాలలో నిర్వ‌హించిన‌ గడపగడపకూ వైయ‌స్సార్సీపీ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న వ‌స్తోంద‌ని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బాబు పాల‌న‌పై ప్ర‌జ‌లు తీవ్ర అస‌మ్మ‌తితో ఉన్నార‌ని ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో  వైయ‌స్సార్సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 

Back to Top