దోచుకోవడమే ధ్యేయంగా బాబు పాలన

బాబుది అంతా నటన
గుంటూరు(పొన్నూరు))ప్రజాసమస్యలను గాలికొదిలేసి దోపిడీయే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ మండిపడ్డారు. గడప గడప కు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా  పొన్నూరు మండలం చినఇటికంపాడు గ్రామం లో పర్యటించారు. ఈసందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా బాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వెంకటరమణ మండిపడ్డారు. సంక్షేమ పథకాలను విస్మరించి దేశాల వెంబడి తిరుగుతూ పెట్టుబడులు తెస్తున్నట్లు బాబు నటిస్తున్నారని విమర్శించారు. బాబు సర్కార్ కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

అధైర్యపడొద్దు..వచ్చేది మన ప్రభుత్వం
ప్రత్తిపాడు))టీడీపీ అధికారంలోకి వచ్చాక నా పింఛన్ రావడం లేదు. గుడ్డివాడిగా పుట్టడం నా తప్పా అని ఓ అంధ వృద్ధుడు మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మేకతోటి సుచరిత వద్ద వాపోయారు. వల్లూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సుచరిత గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వృద్ధులు, వికలాంగులు సుచరితకు తమ ఆవేదనను వెలిబుచ్చారు. దోచుకోవడం దాచుకోవడమే పనిగా బాబు పాలన సాగుతోందని సుచరిత విమర్శించారు. రానున్నది మన ప్రభుత్వమని, వైయస్ జగన్ సీఎం అయ్యాక సమస్యలన్నీ తొలగిపోతాయని, ఎవరూ అధైర్యపడొద్దని సుచరిత వారిలో ధైర్యం కల్పించారు. 

Back to Top