అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్న బాబుకు తగిన గుణపాఠం తప్పదు

శ్రీ‌శైలం: అబ‌ద్ధాల‌తో కాలం వెళ్లదీస్తున్న ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌జ‌లు బుద్ధి చెప్పేరోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బుడ్డా శేషారెడ్డి అన్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలో 15వ వార్డులో శేషారెడ్డి ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్ర‌జా బ్యాలెట్‌ను అంద‌జేస్తూ ప్ర‌జ‌ల‌చేత బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Back to Top