బాబును ఎన్నుకొని తప్పుచేశాం
గ్రామాలన్నీ సమస్యలతో అల్లాడుతుంటే..టీడీపీ నేతలు పట్టించుకోకుండా మొహం చాటేస్తున్నారని, చంద్రబాబును ఎన్నుకొని తప్పుచేశామని ఆయా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె, పత్తికొండ నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లు కాటసాని రామిరెడ్డి, నారాయణరెడ్డిలు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చంద్రబాబు హామీలను విస్మరించి మోసపూరిత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
ఒక్క పథకమూ అమలు కాలేదు
నారపురెడ్డికుంట(శ్రీశైలం): టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా తమ గ్రామంలో కొత్తగా ఒక్క పథకమూ అమలు కాలేదని బండి ఆత్మకూరు మండలం నారపురెడ్డికుంట, నారాయణాపురం వాసులు ఆరోపించారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గ ఇంచార్జీ శేషారెడ్డి ఎదుట ప్రజలు తమ సమస్యలను వెల్లిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డితోనే ప్రజాసంక్షేమం సాధ్యమన్నారు.
శాపంగా మారిన బాబు పాలన
ఆధోని: సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలన ప్రజల పాలిట శాపంగా మారిందని, అన్నివర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నాగనాదన హళ్లి గ్రామంలో కొనసాగిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం వందప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్‌ను ప్రజలకు అందజేసి చంద్రబాబు పాలనపై మార్కులు వేయించారు.
ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వం
కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని వైయస్సార్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ విమర్శించారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన పట్టణంలోని 23వ వార్డు పరిధిలోని శ్రీరామ్‌నగర్, దొడ్లవీధి ప్రాంతాల్లో ఆయన పర్యటించి చంద్రబాబు మోసాలకు ప్రజలకు వివరించారు.
టీడీపీ పాలనలో అవినీతి వరద
మంత్రాలయం: అర్హులై ఉండి కూడా అన్యాయంగా మా పింఛన్లు తొలగించారని, ఇది చాలా అన్యాయం . ముఖ్యమంత్రి చంద్రబాబుకు మా పేదల ఉసురు తగులుతుందని పీకలబెట్టా, బాపులదొడ్డి, హులికన్వీ గ్రామాల ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. వైయస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.