పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం..!

హైదరాబాద్ః పొగాకు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు.రైతులను ఆదుకోవాలని ఎన్ని సార్లు విజ్ఞప్తిచేసినా...చోద్యం చూస్తున్నాయే తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని వాపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో రైతులు ఆత్మహత్యల బారిన పడకుండా కాపాడారని వైవి సుబ్బారెడ్డి ఈసందర్భంగా గుర్తు చేశారు.

ఈఏడాదిలోనే నలుగురు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టొబాకో బోర్డు ఛైర్మన్ బాధ్యతారహితంగా వ్యవహర్తిస్తున్నారని అన్నారు. గిట్టుబాటు కల్పించడంతో పాటు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల వద్ద ఉన్న పొగాకు నిల్వలు కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. 
Back to Top