యువత వైయస్ఆర్ సీపీకి దన్నుగా నిలవాలి

రేణిగుంట:

రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా ఉన్న యువత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని ఆ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రేణిగుంట శ్రీ శ్రీనివాస క్లినికల్ లేబొరేటరీ భవనంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాసంక్షేమం కోసం పరితపించే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని అన్నారు. ముస్లిం మైనారిటీలకు పార్టీలో సముచిత స్థానం కల్పిం చి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రేణిగుంట బుగ్గవీధికి చెందిన ఎండీ.షంషేర్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శిగా నియామకం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రేణిగుంట బుగ్గవీధికి చెందిన షంషేర్ వైఎస్సార్ సీపీ ముస్లిం మైనారిటీ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరీ ఉత్తర్వులు జారీ చేశారు.

Back to Top