యువభేరి పోస్టర్ ఆవిష్కరణ

కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదిగా ఊరించి చివరకు ప్యాకేజీ మంచిదని మాట మార్చడం ప్రజలను మోసగించడమేనని వైయస్‌ఆర్‌సీపీ కర్నూలు జిల్లా పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, అదనపు పరిశీలకుడు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 25న కర్నూలులో నిర్వహించనున్న యువభేరి పోస్టర్లను కర్నూలులో వారు ఆవిష్కరించారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో వారు మాట్లాడారు. హోదా కోసం యువకులు, విద్యార్థుల్లో చైతన్యం తెసుకొచ్చేందుకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 25న కర్నూలులో యువభేరి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఐజయ్య, సారుుప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరితారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య  కార్యక్రమంలో పాల్గొన్నారు.
Back to Top