వైయ‌స్ఆర్‌సీపీలోకి ఊపందుకున్న వ‌ల‌స‌లు

హైద‌రాబాద్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఈ నెల 3న టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేర‌గా, తాజాగా  సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు హబీబుల్లా పార్టీలో చేరారు. హైద‌రాబాద్‌లో వైయ‌స్ఆర్ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆయ‌న‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హబీబుల్లా మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌ రెడ్డి తరఫున ప్రచారం చేసి వైయ‌స్ఆర్ సీపీ గెలుపునకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. నంద్యాల‌లో రోజు రోజుకు పార్టీ బ‌లం పుంజుకుంటోంది. ఇదివ‌ర‌కే మాజీ ఎమ్మెల్యే సంజీవ‌రెడ్డి, సీనియ‌ర్ న్యాయ‌వాదులు, త‌దిత‌రులు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకోగా, వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఇన్‌చార్జ్ జూప‌ల్లె రాకేష్‌, త‌న అనుచ‌రులు వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. నిన్న గోస్పాడు మండ‌లంలో భూమా వ‌ర్గీయులైన మున‌గాల సోద‌రులు త‌మ అనుచ‌రుల‌తో వైయ‌స్ఆర్‌సీపీ గూటికి చేరారు. అలాగే కర్నూలు ఎంపీ బుట్టారేణుక ఆధ్వర్యంలో టీడీపీ, వామపక్షాలకు చెందిన దాదాపు 500 మంది వైయ‌స్ఆర్ సీపీ చేరిన సంగతి తెలిసిందే.  దీంతో ఉప ఎన్నిక‌లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి గెలుపు సునాయాస‌మ‌ని పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు.

Back to Top