యువజన నేత జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష..

రైతుల కోసం ప్రాణత్యాగానికైన సిద్ధం
తూర్పుగోదావరిః పురుషోత్తపట్నం ప్రాజెక్టు భూముల పరిహారం విషయంలో రైతులకు న్యాయం చేయాలంటూ సీతానగరం మండలం రఘుదేవపురంలో ఆమరణ దీక్షకు దిగిన వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా. ఈ కార్యక్రమంలో పిల్లి  సుభాష్‌ చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, రౌతు సూర్యప్రకాశ్‌రావు, కుడుపూడి చిట్టబ్బాయ్, క్రరి పాపారాయుడు,త్రినాథ్‌ రెడ్డి పాల్గొన్నారు. నష్ట పరిహారం విషయంలో న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం తమకేమీ  పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ జరిపి రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా ఇంతవరుకు ఆయా రైతులకు నష్టపరిహారాన్ని అందించకపోవడం ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన విధానానికి తార్కాణం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. పరిహారం పంపిణీ విషయంలో ఆర్‌అండ్‌ఆర్‌  ప్యాకేజీ వర్తించే రైతులు, రైతుకూలీలకు  కూడా న్యాయం చేయకపోవడం బాధాకరం. వీరి న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష చేపట్టారు.
 

తాజా వీడియోలు

Back to Top