విశ్వసనీయతకు ప్రతీక వైయ‌స్ జ‌గ‌న్


 

 టెక్సాస్:  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అంటే విశ్వసనీయతకు ప్రతీక అని వైయ‌స్ఆర్‌సీపీ అమెరికా ఎన్ఆర్ఐ క‌మిటీ అడ్వైజర్, మిడ్ అట్లాంటిక్ రీజియన్ ఇన్‌చార్జ్‌ వల్లూరు రమేష్ రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను, చేసిన చట్టాలను అమలు చేయాలని 4 ఏళ్లుగా కోరుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆయ‌న‌ మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్న తీరు 'తన కంపు తనకిష్టం.. పరుల కంపు పాపిష్టి కంపు' చందంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, అందరినీ వంచించారని నిప్పులు చెరిగారు. 

వైయ‌స్ఆర్‌సీపీ అధ్వర్యంలో ఈనెల ౩౦న వైయ‌స్‌ జగన్ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలపనున్న విషయం తెలిసిందే. దీనికి మద్దతుగా అమెరికాలో వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలు ఆస్టిన్‌లో కొవ్వొత్తుల‌తో ప్ర‌ద‌ర్శ‌న చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా కార్యకర్తలు చేతిలో ప్లకార్డులు పట్టుకొని ‘ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు’ అంటూ నినదించారు. ప్రత్యేక హోదాని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా తాము ఈ నిరసన చేపట్టినట్లుఎన్‌ఆర్‌లు పేర్కొన్నారు. మహానేత స్ఫూర్తితో వైయ‌స్ఆర్‌ సీపీని వైయ‌స్‌ జగన్‌ స్థాపించారని, వైయ‌స్ఆర్‌ ఆశయ సాధనకు వైయ‌స్‌ జగన్‌ నాయకత్వంలో సైనికుల్లా పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.  


ఈ కార్యక్రమంలో వల్లూరు రమేష్ రెడ్డి, చింతగుంట సుబ్బారెడ్డి, బల్లాడ రవి, ఎదురు పుల్లారెడ్డి, నంగి పరమేశ్వర్ రెడ్డి, ద్వారసాల కొండారెడ్డి, గూడూరు అశోక్, స్వదీప్ రెడ్డి, ముట్లూరు సచిన్, బండ్లపల్లి మురళి, మండపాటి సుధాకర్, అస్వపాటి కుమార్, ఆరేకూటి మోహన్ రెడ్డి, ఆవుల మల్లికార్జున్ రెడ్డి, గండ్ర నారాయణ రెడ్డి, వుమ్మ వెంకట్రాం రెడ్డి, లక్కు బ్రహ్మేంద్ర, లక్కిరెడ్డి ప్రదీప్, బోయపల్లె అనంత్, గడికోప్పుల నర్సిరెడ్డి, కంబం దేవేందర్, వసంత రెడ్డి, నామాల వెంకట్, సామల మధు, కడిపికొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.


Back to Top