బాబుతో జతకట్టి ఇందిరాగాంధీ మనవుడు నవ్వులపాలువుతున్నారువైయస్ఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కోల్పోయారుచంద్రబాబును పక్కనబెట్టుకొని అవినీతి గురించి రాహుల్ మాట్లాడడం సిగ్గుచేటుఓఆర్ఆర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మించానని చెప్పుకోవడం విడ్డూరంచంద్రబాబు ఎందరితో చేతులు కలిపినా రాబోయేది రాజన్న రాజ్యమేవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్బాబువిజయవాడ: రాహుల్‌గాంధీ చంద్రబాబుతో జతకట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని, రాహుల్ వ్యాఖ్యలు విని ప్రజలంతా నవ్వుకుంటున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల మధ్యలో కూర్చొని అవినీతి గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై టీజేఆర్ సుధాకర్‌బాబు విరుచుకుపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని టీడీపీతో చేతులు కలిపి అక్రమంగా కేసులు పెట్టించి వేధించారో అప్పుడే రాహుల్, సోనియాగాంధీలు వైయస్‌ఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కోల్పోయారన్నారు. మహానేత వైయస్‌ఆర్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన కుటుంబాలను పరామర్శిస్తానని కర్నూలు నల్లకాల్వ సాక్షిగా వైయస్ జగన్ మాట ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట కోసం తండ్రి లేడని బాధను గుండెల్లో నింపుకొని ఓదార్పు యాత్ర చేస్తుంటే టీడీపీ, కాంగ్రెస్ రెండూ కలిసి ప్రతిబంధకాలు సృష్టించాయని మండిపడ్డారు. వైయస్ జగన్ ప్రజల్లోకి వెళితే ఆ పార్టీలకు మనుగడ ఉండదని అక్రమంగా దొంగ కేసులు పెట్టించి, సీబీఐ, ఈడీని ఉసిగొల్పి వేధించారన్నారు.
చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి అక్రమంగా కేసులు పెట్టించినా వైయస్ జగన్ ఏ రోజూ భయపడలేదని, అవన్నీ డొల్ల కేసులన్నీ బయటపడుతున్నాయని సుధాకర్‌బాబు అన్నారు. వైయస్‌ఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత రాహుల్‌గాంధీ కోల్పోయారన్నారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికి, భారతదేశంలో అత్యంత అవినీతి సీఎంగా పేరుగాంచిన చంద్రబాబును పక్కన కూర్చోబెట్టుకొని తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేసే దుస్థితికి ఇందిరాగాంధీ మనవడు దిగజారిపోయారని జనాలు నవ్వుకుంటున్నారన్నారు. దిగజారుడు, చేతగాని రాజకీయం దేశం అంతా చూస్తోందన్నారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను ఎందుకు సస్పెండ్ చేశారో రాహుల్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. యూపీఏ భయంకర దొంగల ముఠాగా పేరుగాంచిందన్నారు. టీడీపీ స్క్రీప్టులను చదువుతూ గాంధీ కుటుంబం ఇన్నాళ్లూ సాధించిన కీర్తిని చంద్రబాబుతో చేతులు కలిపి రాహుల్ నాశనం చేస్తున్నాడన్నారు.
చంద్రబాబు చేతగాని దద్దమ్మ అని జూన్ 28న కాంగ్రెస్ పార్టీ విడుల చేసిన చార్జిషీట్‌లో చెప్పారని, ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు బాబు నీతివంతుడయిపోయాడా అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లు మోడీతో కలిసి సంసారం చేసిన చంద్రబాబు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా దళితులను అణగదొక్కాడని, దళితులకు ఒక్క మేలు చేసిన దాఖలాలు లేవన్నారు.
హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మించింది నేనే అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాహుల్ గాంధీ మీ పాట్నర్‌కు చెప్పండి 2005లో వైయస్‌ఆర్ పునాది వేసి∙2008లో మీ తల్లి సోనియా సాక్షిగా ఎయిపోర్టును ప్రారంభించారన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు పునాదులు వేసింది వైయస్‌ఆర్. చంద్రబాబు పాలన గురించి కలెక్టర్ల మీటింగ్‌లో మంత్రి పీతాని సత్యనారాయణ చెప్పారన్నారు. బాబు పాలనలో మరుగుదొడ్ల నిధులను కూడా దోచుకుంటున్నారన్నారు. 12918 గ్రామ పంచాయతీలకు మరుగుదొడ్లు నిర్మించాలని నిధులు ఇస్తే అవి కూడా మింగేశారని యూనిసెఫ్ అనే సంస్థ సర్వేలో తేలిందన్నారు. 110 మున్సిపాలిటీల్లో 15లో మాత్రమే రికార్డులు సాధించినట్లు చెబుతుంటే 76 శాతం సంతోషంగా ఉన్నారని సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ చెప్పుకోవడం రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. కనీస అవసరాలు కల్పించాలని 20,81,872 మంది దరఖాస్తు చేసుకుంటే కనీసం వారి సమస్యలు పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు ఎవరితో చేతులు కలిపినా.. వైయస్ జగన్‌పై ఎవరెన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాబోయేది రాజన్న రాజ్యం, వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయన్నారు.