కేసీఆర్‌..లక్ష ఉద్యోగాలేవి?

– వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
– ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆర్డీవో కార్యాలయం ఎదుట  ధర్నా
నల్లగొండ: తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఓట్లు వేయించుకున్న కేసీఆర్‌ మాట తప్పారని, లక్ష ఉద్యోగాలు ఎక్కడ  ఇచ్చారని వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి  ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన బాట పట్టింది. బుధవారం నల్లగొండ జిలా మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ఎదుట వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు.  తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్‌ మోసం చేశారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
 
Back to Top