అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది.  సభలో చర్చించేందుకు తమకు సమయం ఇవ్వనందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు శాసనసభ ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం వాయిదాల పర్వం కొనసాగింది. డ్వాక్రా రుణాలపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడంతో సమావేశాలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం అయినా వైఎస్ఆర్ సీపీ తన పట్టు వీడలేదు.
Back to Top