హైదరాబాద్: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన వస్తున్న తరుణంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు అధికార పార్టీ కుయుక్తులు పన్నుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వెన్నుపోటు విద్యా, దొంగ దెబ్బ అలవాటైన చంద్రబాబు మరో చెత్త ఆలోచన చేశారని ఆమె మండిపడ్డారు. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్‌లో చంద్రబాబు నాయుడు మనుషులు ఓ తప్పుడు కథనం రాయించడం, ఆ తరువాత ఈ రోజు రెండు తెలుగు పత్రికలు ప్రముఖంగా ప్రచురించడం దారుణమన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కోర్టుకు హాజరు అవుతున్నారు కాబట్టి అసత్య కథనాలు బ్యానర్‌గా ప్రచురించడం ఇదెక్కడి న్యాయమన్నారు.