<br/><br/>హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు మంచినీరు ఇవ్వలేని దౌర్భగ్యమైన పాలన సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత చేసిన ఐదు సంతకాలకు విలువే లేకుండా పోయిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఇంటింటికీ మంచినీటిని ఇస్తామన్న చందరబాబు మాట తప్పారన్నారు. ప్రతి కేబినెట్ మీటింగ్‌లోనూ భూములు ఎలా దోచుకోవాలన్నదే ఆలోచిస్తున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్‌పై ప్రతి లీటర్‌కు రూ.4 అదనంగా దోచుకుంటున్నారని విమర్శించారు.