ఉమా..నోటిని అదుపులో పెట్టుకో




–పేదవాడి కోసం నాడు మహానేత 108 అంబులెన్స్‌లు ప్రారంభించారు
– నేడు 108 అంబులెన్స్‌లు మూలనపడ్డాయి
– వైయస్‌ జగన్‌ పాదయాత్రను అవహేళన చేస్తూ దేవినేని వ్యాఖ్యలు 
– మరోసారి నోరుజారితే ప్రజలు చూస్తూ ఊరుకోరు
– దేవినేని ఉమ తన ఆస్తులపై విచారణకు సిద్ధమా? 
– ఉమకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి

అమరావతి: వైయస్‌ జగన్‌ పాదయాత్రపై మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఖండించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే జనం చీపుర్లు తిరగేసి కొడతారని, అదుపులో పెట్టుకోవాలని సూచించారు. దేవినేని ఉమా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆయన సవాలు విసిరారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో విజయనగరం జిల్లాలో 108 వాహనం బహిరంగ సభ ప్రాంతంలోకి వస్తే..దానికి దారి ఇవ్వండి వైయస్‌ జగన్‌ సూచించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పేదవారికి అవసరమైన ప్రాథమిక వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు 108 అంబులెన్స్‌లు ప్రవేశపెట్టారన్నారు. అలాంటి 108 ఈ రోజు సర్వనాశనం చేశారని ఈనాడు పత్రికనే బ్యానర్‌ వార్త రాసిందన్నారు. ఈనాడు ఎవరికి రాజకీయంగా సపోర్టు చేస్తుందో అందరికీ తెలుసు అన్నారు. 108 కుయ్‌ లేదు..రయ్‌ లేదని వార్త రాస్తే..దీనిపై స్పందించాల్సిన ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారన్నారు. అయితే దేవినేని ఉమా స్పందించి వైయస్‌ జగన్‌పై అవాక్కులు చవాకులు పేల్చుతున్నారని మండిపడ్డారు. మా నాయకుడి పాదయాత్రను అవహేళన చేస్తూ మాట్లాడిన లంగా మహేశ్వరరావు నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నాయకుడిని తూలనాడటం ఉమాకు పరిపాటిగా మారిందన్నారు. లంగా మహేశ్వరరావు నీవు పుట్టిన కృష్ణా జిల్లా గడ్డలో కృష్ణమ్మ వారధి వైయస్‌ జగన్‌ పాదయాత్ర అడుగుపెడితే వణికిన విషయం మరిచిపోయావా అని ప్రశ్నించారు. చేతకాని, నికృష్ట, దద్దమ్మ, వెధవ రాజకీయాలకు లంగామహేశ్వరరావు తెర లేపారన్నారు. ఇలాగే ప్రతిపక్ష నాయకుడిపై నోరు పారేసుకుంటే ఛీపుర్లు తిప్పి కొడతారని హెచ్చరించారు. 108ను నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా? ఇంజిన్లు పాడైన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. సిబ్బందికి వేతనాలు అందక అవస్థలు పడుతున్నది వాస్తవం కాదా? ఇదే కదా మీ తోక పత్రికల్లో రాసిందన్నారు. దివంగత సీఎం వైయస్‌ఆర్‌ పథకాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. వారి తండ్రిగారు ప్రవేశపెట్టిన పథకాన్ని సర్వనాశనం చేస్తుంటే వైయస్‌ జగన్‌ చూసి తట్టుకోలేక గళమెత్తారన్నారు. 

– మీ తోక పత్రికల్లో వచ్చిన విశేషాలపై ఎందుకు స్పందించలేదని సుధాకర్‌బాబు ప్రశ్నించారు. 108 కుయ్‌..రయ్‌ లేదనుకుంటే ఆ వార్త రాసిన పత్రికపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఆ పత్రిక అధినేతను ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈనాడులో వచ్చిన వార్త తప్పు అని చెబితే లంగా మహేశ్వరరావు ఉద్యోగం ఊడుతుందన్నారు. గతంలో కేసీఆర్‌ ‘‘నీవు ఆడ..మగా’’ తేల్చి చెప్పు అని ఉమా మహేశ్వరరావును ప్రశ్నిస్తే ఇంతవరకు ఎందుకు స్పందించలేదన్నారు. ఈనాడులో వచ్చిన వార్త కూడా వైయస్‌ జగన్‌ రాయించిందని చెప్పలేదని, అలాంటి సామర్థ్యం ఉన్న నాయకులు టీడీపీలో ఉన్నారన్నారు. వారే ఉద్యమాన్ని సృష్టిస్తారు..నీరు గార్చుతారని తెలిపారు. గతంలో ఎన్‌టీఆర్‌ను అలాగే పదవీ విచ్యుతుడిని చేశారన్నారు. ఇంత గట్టిగా మాట్లాడే ఉమా మహేశ్వరరావు ఈనాడును ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. పేదవాడికి సంబంధించిన వాహనాలు మూలనపడ్డాయని ప్రధాన పత్రికలు రాస్తే దానిపై సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష నేతపై మాట్లాడుతారా అని ధ్వజమెత్తారు. ఈ రోజు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇస్తే..20 నిమిషాల్లో ఫిజ్జా, బర్గర్‌ వస్తుందని, ఈ రోజు 108 రావడం లేదన్నారు. ఇది దుర్మార్గపు ప్రభుత్వం, చీకటి ప్రభుత్వం కాబట్టే ఇలాంటి పరిస్థితి నెలకొందన్నారు. కేసీఆర్‌ ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో 108 వచ్చిందని రుజువైందన్నారు. లంగా మహేశ్వరరావుకు ఆరోగ్యశాఖతో ఏం పని అని ప్రశ్నించారు. ఈనాడులో వచ్చిన వార్తను ఖండించలేకపోయారని విమర్శించారు. 

– నీటిపారుదల శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పలుమార్లు మేం ప్రశ్నించినా ఇంతవరకు అవినీతి జరుగలేదని చెప్పలేకపోతున్నారన్నారు. నాడు జలయజ్ఞానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేసిన వ్యక్తి ఉమా అన్నారు. ఐటీ దాడులు స్వయంగా ముఖ్యమంత్రే ప్లాన్‌ చేశారన్నారు. పట్టుకున్న ధనం ఎందుకు ప్రజల ముందు పెట్టడం లేదన్నారు. అవినీతిపరులైన వ్యక్తులపై దాడులు జరిగితే ఎవరు చేసిన కుట్రగా పేర్కొనడం సిగ్గు చేటు అన్నారు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా పోలీసులను ఉపయోగించుకోవడం బాధాకరమన్నారు. ఉమాకు 108 విలువ తెలియదు కాబట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఆయనకు ప్రాణాలు తీయడం మాత్రమే తెలుసు అన్నారు. స్వయాన ఉమా మహేశ్వరరావు వదిన ప్రాణాలు తీశారని ఆరోపణలు వచ్చాయన్నారు. ఉమా నోరు మూయించడానికి లెక్కలతో సహా చర్చకు వైయస్‌ఆర్‌సీపీ అనేకసార్లు ముందుకు వస్తే ఇంతవరకు సిద్ధం కాలేదన్నారు. 2014లో ఉమా అస్తులు ఎంతా? ఇప్పుడు ఎంతా అన్నది ప్రజలకు చెప్పాలన్నారు. దేవినేని ఉమ తన ఆస్తులపై విచారణకు సిద్ధమా అని సవాలు విసిరారు. 
– ఐదు అంశాలపై ఉమా మహేశ్వరరావు విచారణకు సిద్ధం కావాలని సవాలు విసిరారు.
1. 108 అంబులెన్స్‌పై విచారణకు సిద్ధమా? 
2. ఈనాడులో వచ్చిన వార్తపై న్యాయ విచారణకు సిద్ధమా? 
3. 108 సకాలంలో రాక రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్లు చనిపోయారో? ఎంత మంది అభాగ్యులయ్యారో? ఎంత మంది అవయవాలు కోల్పొయారో ఆ వివరాలు సవివరంగా చెప్పే దమ్ముందా? 
4. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులపై చర్చకు సిద్ధమా? ఐటీ దాడులు దొంగలపై జరుగుతున్నాయా? దోపిడీ దారులపై జరుగుతున్నాయా? సచ్చిలురపై జరుగుతున్నాయో చర్చకు సిద్ధమా?
5. ఉమ వదిన మరణంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. విచారణకు సిద్ధమా? మైలవరంలో జన్మభూమి కమిటీ పేరుతో మీ అనుచరుల ద్వారా జరుపుతున్న ఇసుక దోపిడీపై విచారణకు సిద్ధమా? కృష్ణమ వారధిపై కరకట్ట వద్ద నుంచి అన్ని ప్రాంతాల్లో నీకున్న బినామీ ఆస్తులపై విచారణకు సిద్ధమా? 

– ఉమా మహేశ్వరరావుకు దమ్ము, ఖలేజా ఉంటే చర్చకు సిద్ధం కావాలన్నారు. బహిరంగ చర్చకు వైయస్‌ఆర్‌సీపీ సిద్ధమని స్పష్టం చేశారు. మరోమారు వైయస్‌ జగన్‌ పాదయాత్రను కించపరిచే విధంగా మాట్లాడితే నాలుక చీల్చుతామని ఉమా మహేశ్వరరావును హెచ్చరించారు. వైయస్‌ జగన్‌ సభలు గొందుల్లో, సందుల్లో ఉన్నాయా? జననేత రాకకోసం జనం ఆశతో ఎదురుచూస్తున్నారని, ఎక్కడికి వెళ్లినా అశేష జనం వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ఇంత ప్రజాదరణ ఉంటే నీవు మార్నింగ్‌ వాక్‌ అంటూ మాట్లాడుతావా? నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మరో ఐదు నెలల కాలమే టీడీపీకి సమయం ఉందన్నారు. ఈ దుష్ట అహంకార పరిపాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 



 
Back to Top