ఈ ప్రభుత్వాన్ని వీలైనంత తొందరగా ఇంటికి పంపించాలి


వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
విజయవాడ: చంద్రబాబు చేతిలో ఈ రాష్ట్రం మోసపోయిందని, ఎంత వీలైతే అంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని, వైయస్‌ జగన్‌ను సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అంతా అవినీతిమయమే అన్నారు. ప్రజలను వంచించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, టీడీపీ పాలనలో దాడులు పెరిగిపోయాయన్నారు. మీది అహింసా విధానం అంటే ఎలా నమ్మేదని ప్రశ్నించారు.
 
Back to Top