దోచుకున్నది దాచుకునేందుకే బాబు మాల్దివుల పర్యటన

 – చంద్రన్న కానుక పేరుతో దోపిడీ
– ప్రతి కొనుగోలులోనూ బాబుకు వాటాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో దోచుకున్న అక్రమ సంపాదన లెక్కలు చూసుకొని, దాచుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు మాల్దివుల పర్యటనకు వెళ్లారని  వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రతి కొనుగోలులోనూ చంద్రబాబుకు వాటాలు ఉన్నాయని  విమర్శించారు. చివరకు పేదలకు పంపిణీ చేసే చంద్రన్న కానుకల్లో కూడా దోపిడీకి తెర లేపారని ఫైర్‌ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రన్న కానుకలో నాసిరకం సరుకులు ఇచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్నారు. ఈ ఏడాది కూడా  చందన్న కానుక కింద రూ.450 కోట్లు వెచ్చించి సరుకులు కొనుగోలు చేశారని తెలిపారు.  ఇందులో కూడా దోపిడీ విధానం ఉందని  అనుమానం వ్యక్తం చేశారు. బయట మార్కెట్లో దొరికే రేట్ల కంటే అత్యధిక రేట్లకు బడా బడా వ్యాపారుల నుంచి ఈ సరుకులు కొంటున్నారన్నారు.  ఈ ఏడాది చంద్రన్న కానుకకు సరుకులు ఇచ్చే వారంతా కూడా రూ.30 కోట్ల పైగా టర్నోవర్‌ ఉన్న వారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి టెండర్లు వేశారన్నారు.  కారణంగా ఇతర రాష్ట్రాల వారు కమీషన్లు ఇచ్చిన బయటపడదని చంద్రబాబు ఆలోచనలా ఉందన్నారు. చివరకు పండుగకు సరుకులు ఇచ్చే కార్యక్రమంలో కూడా వందల కోట్లు ఆర్జీంచాలని చంద్రబాబు ఆలోచించడం దారుణమన్నారు. దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లుగా దోచుకుంటున్నారని ఆరోపించారు.  జన్మభూమి కమిటీల్లో లంచాలు, రాజధాని భూముల్లో కమీషన్లు, పోలవరం పనుల్లో కూడా చంద్రబాబే కాంట్రాక్టులు తీసుకొని కమీషన్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. చివరకు తెల్లకార్డుదారులకు ఇచ్చే సరుకుల్లో కూడా దోపిడీకి పాల్పడటం బాధాకరమన్నారు. ఎక్కడ చూసినా ఈ దోపిడీ విధానం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

విచారణ చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయి
చంద్రబాబు దోచుకుంటున్న అక్రమ సంపాదనపై విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూస్తాయని అంబటి రాంబాబు అన్నారు.  ఇటీవల చంద్రబాబు కుమారుడు లోకేష్‌ ఆస్తుల ప్రకటన చేశారు. ఇవి ప్రకటించిన వారానికే చంద్రబాబు కుటుంబ సమేతంగా మాల్దివులకు వెళ్లారన్నారు.  అక్కడికి వెళ్లింది తాను దోచుకున్న సొమ్ము లెక్కలు చూసుకునేందుకే అని విమర్శించారు.  దోచుకున్న సొమ్ము అంతా కూడా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలో మాల్దివులలో ప్రణాళిక రూపొందించారన్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి ద్వారా ఓ ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తే ఆ డబ్బు ఎక్కడిది అన్నది అడిగే నాథుడు లేడన్నారు.  లోకే ష్‌ ఆస్తులు ప్రకటించి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబం విఫరీతంగా దోచుకుంటుందని, దీననై విచారణ చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.
 
Back to Top