– ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే ఇదా టీడీపీ నేతల తీరు– సంస్కారం, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు– చంద్రబాబు ప్లాన్‌లో భాగమే వైయస్ జగన్‌పై దాడి – చంద్రబాబు చెప్పినట్లు డూడూ బసవన్నలా మాట్లాడుతున్నారువిజయవాడ: దళితుల పేరుతో వైయస్ జగన్‌పై కారు కూతలు కూస్తే ఊరుకోబోమని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున టీడీపీ నేతలను హెచ్చరించారు. చంద్రబాబు చెప్పినట్లు అధికార పార్టీలోని కొందరు నాయకులు డూడూ బసవన్నలా మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే ఇదా టీడీపీ నేతల తీరు అని మండిపడ్డారు. సీఎం, మంత్రులు, టీడీపీ నేతల మాటలు అనైతికంగా ఉన్నాయని, పశువుల మాదిరిగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నోటికొచ్చినట్లు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. మంత్రి నక్కా ఆనందబాబు, అచ్చెన్నాయుడు, జవహర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, కారెం శివాజీ, ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ మాటల తీరు దుర్మార్గమన్నారు. మీ నోళ్లలో అశుద్ధం పోసుకున్నారా? మీ నాలుకలు తాటి మట్టలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జననేతపై కుట్ర పన్ని దాడి చేయిస్తే..దేవుడి దయ, వైయస్‌ఆర్ చేసిన మేలులు ఈ ప్రజలకు చేస్తే అందరి ప్రార్థనల వల్ల వైయస్ జగన్ బతికారన్నారు. చంద్రబాబు వద్ద కొందరు దళిత నాయకులు వంగి వంగి దండాలు పెడుతూ మా నాయకుడిపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. అంబేద్కర్ రిజర్వేషన్ల ప్రకారం రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాలని సూచించారు. చంద్రబాబు దళితులను అవహేళనగా మాట్లాడితే ఆయన ముఖంపై ఛీ కొట్టి బయటకు రావాల్సింది పోయి వైయస్ జగన్‌పై విమర్శలు చేస్తారా అని ఫైర్ అయ్యారు. ఆదినారాయణరెడ్డి, దేవినేని ఉమా అంబోతుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. మీ అన్నదమ్ములపై దాడులు చేయిస్తే ఇలాగే మాట్లాడుతారా అని ప్రశ్నించారు. నాడు చంద్రబాబుపై దాడి జరిగితే మహానేత ఎలా స్పందించారో గుర్తు చేసుకోండి అని సూచించారు. రాజేంద్రప్రసాద్ బలిసి మాట్లాడుతున్నారని, వైయస్ జగన్‌ను అంతమొందించేందుకు ఆయన తల్లి, చెల్లి కుట్ర చేశారా? ఇలాంటి మాటలు మాట్లాడితే నీపై కేసు పెడతామని హెచ్చరించారు. వైయస్ జగన్‌ను అరెస్టు చేయించే సత్తా ఆనందబాబు మీ తాతల తరం కాదని హెచ్చరించారు. వైయస్ జగన్‌పై హత్యాయత్నం చంద్రబాబు ప్లాన్‌లోని భాగమే అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకున్న మహానేత కుమారుడిపై హత్యాయత్నం చేస్తారా అని నిలదీశారు. 3 వేల కిలోమీటర్లకు పైగా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న నాయకుడిపై దాడి చేస్తారా అని విమర్శించారు. మీకు సొంత పార్టీ, సొంత ఎజెండా ఉండదన్నారు. అన్ని లాక్కొని మా పార్టీ అని.. ఎవరికో పుట్టిన బిడ్డ మా బిడ్డ అనే రకం మీరని ఎద్దేవా చేశారు. మా పార్టీ తరఫున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేసిన మీకు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక విలువ లేదన్నారు. నోటికివచ్చినట్లు అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. టీడీపీలో ఉన్న నాయకులు దళితులను తాకట్టు పెట్టొద్దని, దళితులకు ఆత్మగౌరవం ఉందని గుర్తు చేశారు. అంబేద్కర్ వారసులమని చెప్పాలంటే అధికార పార్టీలో ఉన్న దళిత నాయకులు ఇప్పటికైనా మీ రాజీనామాలు చంద్రబాబు ముఖాన వేసి రావాలని సూచించారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పాలనను అందించేందుకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. మీరు మాట్లాడినంత మాత్రాన ఒక్క దళితుడు కూడా వైయస్ జగన్‌కు దూరం కారని తెలిపారు.