కార్పొరేషన్‌ భవనాల తరలింపుకు నిరసనగా రిలేదీక్షలు

విజయవాడ: మున్సిపల్‌ కార్పొరేషన్‌ భవనాలను తరలించవద్దని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన బాట పట్టింది. తరలింపునకు నిరసనగా విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద వైయస్‌ఆర్‌ సీపీ కార్పొరేటర్లు రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్పొటర్ల దీక్షలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ భవకుమార్, సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Back to Top