<span style="text-align:justify">వైయస్ఆర్ జిల్లా : పులివెందులలోని వైయస్‌ఆర్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన వైయస్‌ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశానికి సింహాద్రిపురం మండలం నుంచి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. రాష్ట్ర రైతు విభాగపు కన్వీనర్ అరవిందనాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొమ్మా పరమేశ్వరరెడ్డి, మండల పరిశీలకుడు కొమ్మా శివచంద్రారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు సోమశేఖరరెడ్డి, మండల యూత్ కన్వీనర్ శివారెడ్డి, సర్పంచ్‌లు దుంపా వెంకటరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, వెంకటనారాయణరెడ్డి, శివారెడ్డి, ఎంపీటీసీలు కృపాకర్‌రెడ్డి, ఆదినారాయణ, పవన్, రాజగోపాల్‌రెడ్డి, మండల నాయకులు భాస్కర్‌రెడ్డి, శేఖరరెడ్డి, హైటెక్ రవి, కిశోర్‌రెడ్డి, సి.వి.నారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు అన్నిగ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు వెళ్లిన వారిలో ఉన్నారు.</span>