ఘ‌నంగా జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి వేడుక‌లుహైద‌రాబాద్‌:  భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూ జగ్జీవన్‌ రామ్‌​ 111వ జయంతి వేడుక‌లు వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి గుంటూరు జిల్లాలోని వేజేండ్ల శివారులో ఏర్పాటు చేసిన జగ్జీవన్‌ రామ్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయ‌న‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని వైయ‌స్ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ నేతలు బత్తుల బ్రహ్యానంద రెడ్డి, పద్మజ, సంజీవరావు తదితరులు పాల్గొని జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

రాష్ట్ర కార్యాలయంలో..
విజయవాడలోని వైయ‌స్ఆర్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయకులు మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, బొప్పన భవకుమార్‌ తదితరులు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

క‌ర్నూలులో ..
బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి కార్య‌క్ర‌మం కర్నూలు జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో కర్నూలు జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య, నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి , కర్నూలు అసెంబ్లీ ఇన్‌చార్జీ హపీజ్ ఖాన్ , పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top