తోపుదుర్తి కవితకు జక్కంపూడి రాజా ప‌రామ‌ర్శ‌

అనంతపురం  :  వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి సతీమణి తోపుదుర్తి కవితను వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా  పరామర్శించారు. ఇటీవల తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి గుండెపోటులతో మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతపురం చేరుకున్న జక్కంపూడి రాజా ముందుగా వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి అనంత వెంకటరామిరెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి తోపుదుర్తి కవిత ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శిచారు. తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి అకాల మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భాస్కర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Back to Top