చేతగాని వాడికి మాట‌లు, ఉత్త గొడ్డుకు అరుపులు ఎక్కువ‌..!

విజయవాడ:  తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు.. వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మీద చేస్తున్న ఆరోప‌ణ‌ల్ని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్లు, సీనియ‌ర్ ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి క‌ల్ప‌న ఖండించారు. ఈ మేర‌కు వారుఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు తెలుగుదేశం పార్టీ అంటేనే పచ్చి అబద్ధాలను వండి వార్చే పుకార్ల ఫ్యాక్టరీ అని, అందుకే ఏపీ సర్కారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి అడ్డుకుంటున్నారని చంద్రబాబు, టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని  మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబు.. తమ పార్టీపై అభాండాలు వేయకుండా ఉంటారని తాము ఆశించడం లేదని కొడాలి నాని, ఉప్పులేటి కల్పన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగం.. ఈ మూడింటిలోనూ ఏపీని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు చేతగానితనానికి పతిపక్ష నేత బాధ్యత వహించాలా? అని వారు నిలదీశారు.

1


Back to Top