ప్ర‌జా పాల‌న‌కు పునాది ``న‌వ‌ర‌త్నాలు``

వెలగపూడి(తుళ్లూరు రూరల్‌):

 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించిన ``న‌వ‌ర‌త్నాలు`` అద్భుతంగా ఉన్నాయ‌ని, ఈ న‌వ‌ర‌త్నాలే ప్ర‌జా పాల‌న‌కు పునాది అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ అన్నారు. వెలగపూడి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ గ్రామ అధ్య‌క్షుడు జొన్నలగడ్డ కిషోర్‌ అధ్యక్షతన ప్రారంభమైన ``వైయ‌స్ఆర్ కుటుంబం`` కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ,తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో ప‌నిచేస్తే బాబు పాల‌న‌ను త‌రిమి కొట్ట‌వ‌చ్చ‌న్నారు.  ప్రతి కుటుంబాన్ని వైయ‌స్ఆర్ కుటుంబంలో  ఫోన్‌ ద్వారా నమోదు చేయించాలన్నారు. అనంతరం హెనీ క్రిస్టీనా మాట్లాడుతూ ప్రతి బూత్‌ కన్వీనర్‌ ఒక సైనికుడిలా పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ప్రతి ఒక్కరి కృషిని గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కొన్ని ఇళ్లకు వెళ్లి నవర త్నాల ప‌థ‌కాల‌ను వివ‌రించారు. 

తాజా ఫోటోలు

Back to Top