ప్ర‌తిప‌క్షం ఇప్పుడు గుర్తొచ్చిందా?

ఢిల్లీ: చ‌ంద్ర‌బాబు త‌న నాలుగేళ్ల పాల‌న‌లో ఏ నాడు  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షమైన వైయ‌స్ఆర్‌సీపీతో చ‌ర్చించ‌లేద‌ని, ఇప్పుడు గుర్తుకు వ‌చ్చిందా అని చంద్ర‌బాబును వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్ర‌శ్నించారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విష‌యంపైనైనా చ‌ర్చించావా అని ఆయ‌న చంద్ర‌బాబును నిల‌దీశారు. ఢిల్లీలో మంగ‌ళ‌వారం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..చంద్ర‌బాబు ఏర్పాటు చేసిన అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. నాడు ఎవ‌రిని అడిగి ప్ర‌త్యేక హోదా వ‌ద్ద‌ని ప్యాకేజీని స్వాగ‌తించార‌ని ప్ర‌శ్నించారు. అమ‌రావ‌తి డిజైన్ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షం గుర్తుకు రాలేదా అని నిల‌దీశారు. అవ‌శ్వాస తీర్మానం తీవ్ర‌త‌ను త‌గ్గించేందుకు చంద్ర‌బాబు అఖిల‌ప‌క్ష స‌మావేశం డ్రామాను తెర‌పైకి తెచ్చార‌న్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ 13 జిల్లాల ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై చైత‌న్యం తెచ్చార‌న్నారు. చంద్ర‌బాబు ఇప్ప‌డు కొత్త డ్రామాకు తెర లేపితే ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేర‌న్నారు.


Back to Top