స్పీక‌ర్ వెల్‌లోకి చొచ్చుకెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు


ఢిల్లీ:  రెండో విడత బడ్జెట్‌ సమావేశాల ఐదో రోజు కూడా పార్లమెంట్‌లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ  ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని లోక్‌సభ స్పీకర్‌ వెల్‌లోకి చొచ్చుకెళ్లారు.  కార్యకలాపాలు సజావుగా నడపలేని స్థితిలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ సరిగ్గా ఇలాంటి దృశ్యమే చోటుచేసుకుంది. ఎంపీల ఆందోళనలన నేపథ్యంలో చైర్మన్‌ వెంకయ్యనాయుడు రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేశారు.
Back to Top