ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు  అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్రం మాట నిలబెట్టుకోవాలన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నిర్వహించిన ధర్నాకు... వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవులను కాపాడుకునేందుకే టీడీపీ నేతలు నోరు విప్పడం లేదని విమర్శించారు. మోడ్రన్ కేటగిరి అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని అన్నారు.

Back to Top