దీక్ష విరమించేది లేదు

ఢిల్లీ: ప‌్ర‌త్యేక హోదా, విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలు అమ‌లు చేసే విష‌యంలో కేంద్రం దిగి వచ్చే వ‌ర‌కు దీక్ష విర‌మించేది లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నాలుగు రోజులుగా ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు చెబుతున్నారు. సోమవారం ఉదయం సుబ్బారెడ్డిని పరీక్షించిన వైద్యులు ఆయన పూర్తిగా డీహైడ్రేషన్‌కు గురయ్యారని తెలిపారు. ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే చికిత్స చేయాలని వైద్యులు చెప్పినా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వైవీ సుబ్బారెడ్డి మాత్రం దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. కాగా, తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఇద్దరు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాదరావులను ఇప్పటికే బలవంతంగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏపీకి సంజీవని లాంటి హోదా సాధన కోసం 73 ఏళ్ల వయసులో మేకపాటి, 64ఏళ్ల వయసులో వరప్రసాద్‌లు ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. 

Back to Top