డీజీపీ చంద్రబాబు తొత్తు..

ప్రతిపక్ష నేతకు తగిన రక్షణ కల్పించడంలేదు..
కోడిపందాల కత్తి ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలా వచ్చింది..
వైయస్‌ఆర్‌సీపీ నేత విజయసాయి రెడ్డి
హైదరాబాద్ః భగవంతుడి దయ ఉంది కాబట్టి ప్రాణాభయం తప్పిందని విజయిసాయి రెడ్డి అన్నారు. ఆయన హైదరాబాద్‌ సిటీ న్యూరో హాస్పిటల్‌లో మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌పై జరిగిన దాడి హత్యాయత్నం విషయంలో డీజీపీ వ్యాఖ్యలు బాధాకారమన్నారు.విచారణ చేయకముందే ఇష్టంవచ్చినట్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చారన్నారు. చంద్రబాబు తొత్తుగా డీజీపీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడికి ప్రభుత్వం తగిన రక్షణ కల్పించడంలేదు. కోడిపందాలకు ఉపయోగించే కత్తి ఎయిర్‌పోర్ట్‌ లోపలికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. హత్యయత్నం చేసిన వ్యక్తి తెలుగుదేశానికి చెందిన క్యాంటిన్‌లో పనిచేస్తున్న వ్యక్తి కావడం పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. డీజీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారన్నారు. డీజీపీ నిజంగా పోలీసు విచారణ నైపుణ్యం ఉన్నట్లుయితే కేసు గురించి ఇలా మాట్లాడేవారు కాదన్నారు. కాపీ కొట్టి ఐపిఎస్‌ పాస్‌ అయ్యారనే  అనుమానం కలుగుతుందన్నారు. ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పుతారన్నారు.

తాజా వీడియోలు

Back to Top