ఎంపీ పదవులకు రాజీనామా చేద్దాం రండి

ఢిల్లీ: టీడీపీ నేతలు మంత్రి పదవులకు రాజీనామా చేసినంతమాత్రనా సరిపోదని, ఎంపీ పదవులకు తమతో పాటు రాజీనామా చేయాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలిచ్చింది ఎంపీ పదవి, మంత్రి పదవులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తే చాలదని, ఎంపీ పదవులకు రాజీనామా చేయాలన్నారు. రాజీనామాల విషయంలో టీడీపీ ఎంపీలు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో చెప్పాలన్నారు.  వైయస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణలు సరికాదని, నాలుగేళ్లలో వైయస్‌ జగన్‌కు సంబంధించిన ఒక్క కేసులో కూడా ఆయన తప్పు చేసినట్లు తేలలేదన్నారు. ప్రత్యేక హోదా బిక్ష కాదని, అది మన హక్కు అన్నారు. విభజన చట్టం ప్రకారం మనకు ఇచ్చి తీరాల్సిందే అన్నారు. దుగ్గరాజపట్నం పోర్టును కూడా 2018లోగా పూర్తి చేయాల్సిందే అన్నారు. వెనుకబడిన మండలాల అభివృద్ధికి దుగ్గరాజపట్నం పోర్టు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలం సిద్ధంగా ఉన్నామని, పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
 
Back to Top