టీడీపీ నీచ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి

వైయస్‌ జగన్‌ ప్రసంగం ప్రజలు చూడకుండా కరెంట్‌ కట్‌ 
అధికార బలంతో వైయస్‌ఆర్‌ సీపీ ఫ్లెక్సీల తొలగింపు
ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో జననేత రూపం చెరపలేరు
విజయనగరం: తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు తారాస్థాయికి చేరాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోలగొట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం టౌన్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తుంటే.. విద్యుత్‌ సరఫరాను నిలిపివేయించి తెలుగుదేశం పార్టీ నేతలు వారి నీచ బుద్ధిని ప్రదర్శించారన్నారు. 276వ రోజు ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న కోలగట్ల మీడియాతో మాట్లాడుతూ.. అధికార బలంతో విజయనగరంలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ సీపీ ఫ్లెక్సీలను తీయించారన్నారు. పదుల సంఖ్యలో ఫ్లెక్సీలు అయితే తీయించారు కానీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వైయస్‌ జగన్‌ చిత్రాన్ని మాత్రం ఎవరూ తొలగించలేరన్నారు. ఇంత వరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడికి సభకు రానంత ప్రజలు నిన్న జరిగిన బహిరంగ సభకు స్వచ్ఛందంగా హాజరయ్యారన్నారు. రాష్ట్ర ప్రజానీకం అంతా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైయస్‌ జగన్‌ ఎక్కడకు వెళితే అక్కడ జన సునామీ పుట్టుకొస్తుందన్నారు. జననేత ప్రకటించిన నవరత్నాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. నేటితో విజయనగరం నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తవుతుందన్నారు. నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన నాటి నుంచి ఆయన వెన్నంటే ఉంటూ.. సమస్యలు వివరించి.. మహాసముద్రంలా కదిలిన ప్రజానీకానికి, వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

ఉదయం లేచింది మొదలు ఏ అవినీతి చేయాలి. ఎలా డబ్బు సంపాదించాలనే తపన తప్ప ప్రజలను ఎలా ఆదుకోవాలి.. వారిని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు అంతా దోపిడీకి అలవాటు పడ్డారన్నారు. ప్రజలు అసహ్యించుకునే పరిస్థితికి దిగజారారన్నారు. బాబు అవినీతి, అక్రమాలకు రోజులు దగ్గరపడ్డాయని, 2014లో నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top