‘నీరు–చెట్టు’లో వేల కోట్ల అవినీతి

– నిరుద్యోగ భృతిపై మాట తప్పిన చంద్రబాబు
– విదేశీ పర్యటనల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం
– ప్రత్యేక హోదా కోసం ఇప్పటికైనా కలిసి పోరాడుదాం
–  అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతుపై హర్షం

విజయవాడ: టీడీపీ ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా సాగుతుందని, చంద్రబాబు నుంచి గ్రామస్థాయిలోని జన్మభూమి కమిటీ సభ్యుల వరకు అందినకాడికి దోచుకుంటన్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. నీరుచెట్టు పేరుతో వేల కోట్ల నిధులు టీడీపీ నేతలు స్వాహా చేశారని విమర్శించారు. ఒక్క ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే రూ.80 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని, లేదంటే ప్రతి నెల రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పారన్నారు. ఇప్పటి వరకు 46 నెలలకు సంబంధించిన నిరుద్యోగ భృతి చంద్రబాబు బాకీ పడ్డారన్నారు.  విదేశీ పర్యటనలకు చంద్రబాబు రూ.2.40 లక్షల కోట్లు రాష్ట్రానికి అదనపు భారం పడిందని విమర్శించారు. నిన్న సాయంత్రం చంద్రబాబు పార్టనర్‌ పవన్‌ కళ్యాన్‌ కూడా ఇసుక మాఫియా జరిగిందన్నారు. ఇదే సింగపూర్‌లో అయితే తోలు ఊడిలా కొట్టేవారు అన్నారు. ఏ ఎండకు ఆ గోడుగు పట్టిన చంద్రబాబు అన్ని అబద్ధాలు చెప్పారన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలు అని అర్ధరాత్రి ప్రెస్‌మీట్లు పెట్టి స్వాగతించారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదా కోసం ధర్నాలు, బంద్‌లు, యువబేరిలు నిర్వహించారన్నారు. యువభేరిలకు వచ్చిన వారిపై పీడీ యాక్ట్‌ కేసులు పెట్టిన చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు చేసింది ఏంటీ అని ప్రశ్నించారు. అబద్ధాలు, మోసాలు, వెన్నుపోటులే ఆయన పాలనకు నిదర్శమన్నారు. జన్మభూమి కమిటీలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. నీరు–చెట్టు పథకంలో అవినీతి కట్టలు తెగిందన్నారు. మా నియోజకవర్గంలోనే రూ.80 కోట్ల పనులు నీరు–చెట్టు కింద పనులు చేపట్టారని, ఇందులో 40 శాతం పనులు అవినీతిమయమయ్యాయన్నారు. వేల కోట్ల అవినీతికి పాల్పడిన టీడీపీపై విచారణ చేపట్టాలన్నారు. మిగిలిన సమయంలోనైనా టీడీపీ నేతలు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలించాలన్నారు. రేపు మా ఎంపీలు పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకడం శుభపరిణామమని, ఇప్పటికైనా టీడీపీకి బుద్ధి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌తో కలిసి పోరాటం చేయాలని ఆయన కోరారు. 
 
Back to Top