జనం చెంతకు వైఎస్ఆర్ సీపీ....

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్షం ఎమ్మెల్యేలు సోమవారం పలు గ్రామాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యటన సందర్భంగా అక్కడి రైతుల వారి సమస్యలను ఎమ్మెల్యేలకు వివరించారు. మీ సమస్యలను మార్చిలో ప్రారంభ౦ కానున్నఅసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని అలాగే ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

రాజధాని గ్రామాలైన తుళ్లూరు, రాయపూడి, లింగాయపాళెం, ఉద్దండరాయుని పాళెం, తాళ్లాయ పాళెం, ఐనవోలు, కురగల్లు, నిడమర్రు, ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లిలో వైఎస్ఆర్ సీపీఎల్పీ బృందం పర్యటి౦చారు. అనంతరం సీఆర్ డీఏ కమీషనర్ శ్రీకాంత్ ను కలిసి వినితిపత్రం అందజేశారు.

తాజా ఫోటోలు

Back to Top