అసెంబ్లీ ద‌గ్గ‌ర ఆందోళ‌న‌కు దిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు

హైద‌రాబాద్‌) అసెంబ్లీ గేట్ ద‌గ్గ‌ర ఎమ్మెల్యే రోజాను నిలిపివేయటంపై ప్ర‌తిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆందోళ‌న‌కు దిగారు. 
శాస‌న‌స‌భ‌లో అన్యాయంగా ప్ర‌భుత్వ ప‌క్షం ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. దీని మీద న్యాయ‌పోరాటం చేసి ఎమ్మెల్యే రోజా విజ‌యం సాదించారు. ఆమెను శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు అనుమ‌తివ్వాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల కాపీని శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి స‌త్య‌నారాయ‌ణ కు ఆమె అంద‌చేశారు. ఉద‌యం ఆమె స‌మావేశాల‌కు హాజ‌రు అయ్యేందుకు వెళుతున్న‌ప్పుడు మార్ష‌ల్స్ అడ్డుకొన్నారు. స్పీక‌ర్ ఆదేశాల మేరకు ఆమెను అడ్డుకొన్నారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. 
Back to Top