గాంధీవిగ్రహం వద్ద వైయస్సార్సీపీ ఎమ్మెల్యేల నిరసన

హైదరాబాద్ః ప్రభుత్వ నిరంకుశ,మోసపూరిత వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మూడు రోజుల పాటు హోదా కోసం వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పోరాటం కొనసాగించారు. చర్చకు రాకుండానే చంద్రబాబు సర్కార్ నిరవధి వాయిదా వేయించుకొని వెళ్లిపోయింది.  ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించిన ప్రతిపక్షం గొంతు నొక్కుతూ టీడీపీ సభా సంప్రదాయాలను మంటగల్పింది. ప్రతిపక్ష సభ్యులను అధికార టీడీపీ తిట్టడమే పనిగా పెట్టుకుంది తప్ప...రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకున్న పాపాన పోలేదు.

Back to Top