అనంతకు నీరు ఇవ్వడం ఇష్టం లేదా బాబూ?

జలసంకల్పయాత్రకు విశేష స్పందన
జీడిపల్లి రిజర్వాయర్‌ పూర్తయినా నీరు ఎందుకు ఇవ్వరు
వైయస్‌ జగన్‌ వస్తే వ్యవసాయం పండుగే
అనంతపురం: ఉరవకొండకు తాగు, సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి జల సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. జల సంకల్పయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. రాకెట్‌ గ్రామానికి చేరిన పాదయాత్రలో ఎమ్మెల్యే జయరాం, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిలు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. జీడిపల్లి రిజర్వాయర్‌ పూర్తయి ఆరేళ్లు గడుస్తుందన్నారు. రిజర్వాయర్‌ పూర్తయినా ఎందుకు నీరు ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లో ఉరవకొండలో 80 వేల ఎకరాలకు నీరు ఇస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ చెప్పారని గుర్తు చేశారు. మంత్రి పదవి రాలేదని కన్నీరు కార్చిన పయ్యావుల కేశవులు.. రైతులకు నీరు రావడం లేదంటే కళ్లకెందుకు నీరు రావడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్‌ వ్యవసాయానికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. కరువుతో అల్లాడుతున్న అనంతపురంను పట్టించుకోకుండా రెయిన్‌ గన్స్‌ అంటూ వందల కోట్లు కాజేశారని ఆరోపించారు. వ్యవసాయ సాగుకు నీరు లేక రైతులు కూలీలుగా మారి వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేయాలి
వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే వ్యవసాయాన్ని పండుగలా చేస్తానని చెప్పడం జరిగిందని విశ్వేశ్వర్‌రెడ్డి గుర్తు చేశారు. అంతే కాకుండా రైతులకు ఉచితంగా బోర్‌ కూడా వేయిస్తానని, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, పెట్టుబడి రుణం అందజేస్తానని చెప్పారన్నారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకొని వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రజలు కృషి చేయాలన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top