వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మిస్తాం


 తిరుమల :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తిరుమ‌ల‌లో  వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మిస్తామని న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. వెయ్యికాళ్ల మండపాన్నికూల్చివేయడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేయడం దారుణం అన్నారు. ఈ  విషయాన్ని చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ధ్వ‌జ‌మెత్తారు. ప్రజల మనోభావాలని దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని ఆర్కే రోజా డిమాండ్‌ చేశారు.  

Back to Top