లోకేష్‌కు ట్యూష‌న్ చెప్పించేందుకు ఏడాదికి రూ.2 కోట్లు
– విజయనగరంలో చెరుకు రైతుల ధర్నా
విజయనగరం:  నారా లోకేష్‌కు ట్యూష‌న్ చెప్పించేందుకు ఏడాదికి రూ.2 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని,  రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. చెరకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం విజయనగరంలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
రైతులకు రూ.11 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులేదా అని ప్రశ్నించారు. నారా లోకేష్‌కు ట్యూషన్‌ చెప్పేందుకు రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. చెరుకు రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడం బాధాకరమన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ.10, 20 కోట్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబుకు చెరుకు రైతులు నష్టపోతుంటే చీమ కుట్టినట్లు కూడా లేదా అని నిలదీశారు. వందల కోట్ల ఆస్తులు కాపాడుకునేందుకు టీడీపీలోకి వెళ్లినా నాయకులు రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేరా అన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top