చంద్రబాబు ఫిరాయింపు బాగోతం బట్టబయలుకురుపాం: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వీడియోతో చంద్రబాబు బాగోతం బట్టబయలు అయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడం సిగ్గుచేటని మండిపడ్డారు. తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పరిస్థితులను బట్టి చంద్రబాబు ఒక్కో పదవికి ఒక్కో రేటు ఫిక్స్‌ చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను ఏ విధంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారో.. గిడ్డి ఈశ్వరి వీడియో ద్వారా వెల్లడైందన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి అపహాస్యం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Back to Top