‘హంద్రీనీవా’ కోసం ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిరాహార దీక్ష


అనంతపురం: హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి  నిరాహార దీక్ష ప్రారంభించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని హంద్రీనీవా ప్రాజెక్టు శిలాఫలకం  వద్ద నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిరశన దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.  త్వరలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో హంద్రీనీవాకు రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని  డిమాండ్ చేశారు. ఖచ్చితంగా 100 టీఎంసీల నీటిని హంద్రీనీవా ప్రాజెక్టుకు కేటాయించాలన్నారు. దుర్భిక్ష ప్రాంత రాయలసీమను సీఎం చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆయన పదవిని చేపట్టినప్పటినుంచి సీమలోని సాగునీటి ప్రాజెక్టులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.  విశ్వేశ్వరరెడ్డి నిరాహార దీక్షకు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, జయరాములు, ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఐజయ్య, అత్తార్ చాంద్‌బాషా, మణిగాంధీ, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి,  మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తదితరులు సంఘీభావం తెలిపారు.
Back to Top