వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఉక్కు పరిశ్రమ


ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని రైల్వే కోడురు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. రాజంపేట మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం నాలుగేళ్లు ఒక్క మాట కూడా మాట్లాడని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్షల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ సీఎం కాగానే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
 
Back to Top