బాబుకు చిత్త‌శుద్ధి లేదు

విశాఖ‌: ప‌్ర‌త్యేక హోదా సాధ‌న విష‌యంలో చంద్ర‌బాబుకు చిత్త‌శుద్ది లేద‌ని ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి విమ‌ర్శించారు. విశాఖ దీక్ష‌లో ఆయ‌న మాట్లాడారు. నాలుగేళ క్రితం టీడీపీ, బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలకు హమీ ఇచ్చాయన్నారు.  వైయ‌స్ జగన్‌ ప్రత్యేక హోదా కోసం పోరాటాలు, దీక్షలు చేశారని గుర్తు చేశారు.  చంద్రబాబు త‌న కుమారుడు లోకేష్‌తో రెండు రోజులైనా నిరాహరదీక్ష చేస్తే సగం బరువు తగ్గేవాడని ఎద్దేవా చేశారు. పరకాల ప్ర‌భాక‌ర్ భార్య బీజేపీలో కేంద్రమంత్రి, తానేమో టీడీపీలో ఉన్నార‌ని వీరిని ఎలా న‌మ్మాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
Back to Top