ఏపీలో దోచుకున్న సొమ్మే ఇతర రాష్ట్రాల‌కు పంపిణీ

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కళావతి..
శ్రీకాకుళంః చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతి సొమ్మును ఇతర రాష్ట్రాల‌కు  తరలిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కళావతి అన్నారు.ఐదు రాష్ట్ర్రాల్లో బీజేపీని ఓడించానని చంద్రబాబు చెప్పుకుంటున్నారంటే ఖచ్చితంగా డబ్బు తరలించే ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.ప్రచారానికి వెళ్లకుండా గెలుపుకు నేనే కారణమంటూ చెప్పడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.ఏపీలో దోచుకున్న అవినీతి సొమ్ము అండతోనే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతానని చంద్రబాబు అంటున్నారన్నారు.తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కోట్లు తరలించిన ప్రజలు తిరస్కరించారన్నారు.రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబుకు సరైన బుద్ధి చెబుతారన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top